220

హనుమాన్ కథల క్విజ్

హనుమంతుడు హిందువులకి అత్యంత ప్రియమైన దేవుళ్లలో ఒకరు. వీధి మూల చిన్న గుడిలోగానీ లేదా చాలాఎత్తైన దివ్య మంగళ విగ్రహంగా కానీ, హనుమ కటాక్షం సర్వత్రా ఉంటుంది. లెక్కలేనన్ని పేర్లతో, లక్షలాది కథలతో హనుమను భక్తులు కొలుస్తారు. హనుమద్ జయంతి సందర్భంగా, హనుమంతుడి గురించి 12 ప్రసిద్ధ కథలను అన్వేషిద్దాం. తన తల్లి పేరుతోనే విస్తృతంగా పిలువబడే హనుమంతుని తల్లి ఎవరు?  ఆజన్మ బ్రహ్మచారి గా ప్రసిద్ధమైన హనుమంతునికి కొడుకు ఉన్నాడా? మహాభారతంలో హనుమ కు వరుసైన సోదరుడు ఎవరు? జై బజరంగబలి!

మారుతి భారతదేశంలో తయారైన మొట్టమొదటి జపనీస్ కారు. మారుతి యాజమాన్యంలో సుజుకి యొక్క భాగస్వామి ఎవరు?

హనుమంతుడి ప్రసిద్ధ పేర్లలో ఒకటి “ఆంజనేయుడు”. ఇది ఎవరిని సూచిస్తుంది?

హనుమాన్ అంటే సంస్కృతంలో “విరిగిన దవడ” అని అర్థం. ఈ పేరు యొక్క మూలాన్ని వివరించే పురాణ కథ ఏది?

కురుక్షేత్ర యుద్ధంలో హనుమంతుడు ఎవరి రథం జెండాపై ఉన్నాడు?

హనుమంతుడికి అమరత్వాన్ని ప్రసాదించి, “చిరంజీవి”గా మార్చినది ఎవరు?

హనుమంతుడు మానవాళి యొక్క అనంత రక్షకుడు. ఆయన పేర్లలో ఏది దీనిని ప్రతిబింబిస్తుంది?

హనుమాన్ గర్హి అయోధ్యలో అత్యంత పవిత్రమైన స్థలం. హనుమంతుడు అక్కడ ఏ బాధ్యత తో నివసిస్తున్నాడు?

ప్రజలు హనుమంతుడు ఎల్లప్పుడూ బ్రహ్మచారి (పెళ్లి చేసుకోని వ్యక్తి) అని అంటారు. కానీ కొన్ని కథలు అతనికి ఒక కొడుకు ఉన్నాడని చెబుతున్నాయి. ఆ కొడుకు పేరు ఏమిటి?

హనుమంతుడు మొదట రాముడిని కిష్కింధలో కలిశాడు. కిష్కింధ ఏ రాష్ట్రంలో ఉంది?

ఒక ప్రసిద్ధ జ్యోతిర్లింగ పట్టణంలో ‘పంచముఖ’ (ఐదు ముఖాల) హనుమాన్ ఆలయం కూడా ఉంది. ఆ పట్టణం ఏది?

సంజీవని మూలిక కోసం హనుమంతుడు హిమాలయాలకు వెళుతున్నప్పుడు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు, అక్కడ ఒక ప్రసిద్ధ ఆలయం ఉంది. అది ఎక్కడ ఉంది?

హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొని తిరిగి వెళుతున్నప్పుడు సిక్కింలోని గాంగ్‌టక్‌లోని హనుమాన్ టోక్‌లో విశ్రాంతి తీసుకున్నాడని చెబుతారు. ఈ ఆలయాన్ని ఎవరు చూసుకుంటారు?

నిష్క్రమించు

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In

× Notify Me