ఛాందోగ్య ఉపనిషత్తు గురించిన ఒక హృద్యమైన కథ ఉంది. హరిద్రుమాత గౌతముడు అనే ఋషి వద్దకు ఒక బాలుడు వచ్చి నన్ను మీ శిష్యునిగా స్వీకరించి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతాడు. పిల్లవాడి పూర్వాపరాలు తెలుసుకునే నిమిత్తమై ఋషి, నీ తల్లితండ్రులెవరు, వారి గోత్రనామాలేమిటి? అని అడుగుతాడు. పిల్లవాడు తెలియదని, తల్లిని అడిగి తెలుసుకు వస్తానని వెళ్లి తల్లిని అదే ప్రశ్న అడుగుతాడు.
నాయనా, నా పేరు జాబాల, నిన్ను సత్యకామునిగా పిలుస్తాను.నేను దాసిగా చాలా మందిని సేవించాను, నీవు ఎవరి బిడ్డవో, నీ తండ్రి కులగోత్రాలు ఏమిటో నాకూ తెలియవని సమాధానమిస్తుంది. తిరిగివచ్చిన బాలుడు అదే సమాధానము ఋషికి చెప్పగా , సంతోషించిన ముని , జ్ఞాని అయిన వాడు మాత్రమే చెప్పగలిగే నిజాన్ని నీవు అత్యంత నిజాయితీగా చెప్పావు కావున నేనిప్పుడే నిన్ను బ్రహ్మచారిగా స్వీకరించి విద్యాబుద్ధులు నేర్పిస్తాను అని చెపుతాడు.
ఏది అయితే నీవు తెలిసుకోవాలనుకుంటున్నావో అది నీవే (అత్యున్నతమైన పరబ్రహ్మ వేరెక్కడో లేడు , అది నువ్వే) అని చెప్పే మహా వాక్యం తత్వమసి (అది నువ్వే, అది నువ్వే) సామవేద అంతర్గతమైన ఛాందోగ్యోపనిషత్తు లోనిది. ఛాందోగ్యోపనిషత్తు ఉపనిషత్తులలో అతి పురాతనమైనది, రెండవ అతి పెద్దది.
మట్టికి, కుండకు; బంగారానికి, బంగారు నగలకు ఉండే సంబంధాన్ని అతి సున్నితంగా తెలియచెప్పే ఛాందోగ్యోపనిషత్తు మహాభారత సంబంధం లేకుండా శ్రీకృష్ణ మహత్తును తెలియచెపుతుంది.
మూలం: చిన్మయ అంతర్జాతీయ సంఘం వారి ఉపనిషత్ మాల నుండి.
చిత్రము : సత్యకామ జాబాల కథ నుండి. https://thephilosophicalmultiverse.com/ సౌజన్యముతో