బ్రిటీషు సంస్కర్త ఆనీ బెసంట్ (1847-1933) సామ్యవాదం, కుటుంబ నియంత్రణ, ట్రేడ్ యూనియన్లు, స్త్రీహక్కులకు ఒక ప్రబల మద్దతుదారు. ఆవిడ దివ్యజ్ఞాన సమాజం యొక్క కార్యకలాపాలలో పాల్గొనేవారు. ఆమె ‘హోమ్ రూల్ లీగ్’ను స్థాపించి, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. రెండు అనువాదాలు, రెండు ఉపన్యాసవళుల సహాయంతో ఆవిడ గీతను శోధించారు. క్రైస్తవ వేదాంతశాస్త్రపు పదజాలాన్ని ఉపయోగించుకుని, భగవద్గీతలో రహస్య సందేశమున్నదని, దాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు.
శాస్త్రీయంగా భగవద్గీతను నిర్దిష్టమైన ఒక తాత్విక-మతపరమైన సంప్రదాయంగా భావించినా,
ఆవిడ మాత్రం ఆధ్యాత్మికాభివృద్ధికై ఆ గ్రంథమొక సార్వత్రిక పద్ధతి అన్వీ అభిప్రాయపడ్డారు. “ఆ పవిత్రగ్రంథం యోగాభ్యాసానికి చెందినదంటే, దైవశాసనానికి అనుగుణంగా ఉన్నట్టే! అంటే భగవదైక్యం పొందడానికే కదా! పరమాత్మతో సామరస్యాన్ని సంపాదించడానికే కదా!” అన్నారు ఆవిడ. కూరుక్షేత్రమంటే ఆత్మయొక్క యుద్ధభూమి అని, అర్జునుడు కష్టపడుతున్న ఆత్మ అనీ, కృష్ణుడు లోగోస్ (అనగా యేసు క్రీస్తు) అనీ, భగవద్గీత ఆకాంక్షించే ఆత్మలకు ఉపదేశమనీ, ప్రాక్పశ్చిమాల ధ్యేయం ఒకటేననీ, దారులు మాత్రం వేరనీ ఆవిడ అభిప్రాయపడ్డారు.
మూలం: ఏంజెలికా మలినర్, ‘ద గ్రేట్ అన్వెయిలింగ్: ఆనీ బెసెంట్ అండ్ ద భగవద్గీత,’ జూరిచ్ విశ్వవిద్యాలయం.