230

శ్రీకృష్ణుడు మరియు నరకాసురుడికి సంబంధించిన క్విజ్

దీపావళి పండుగ అనేక రూపాలలో జరుపుకునే ఒక ఉత్సవం. రాముడు, లక్ష్మి, కాళి మరియు శ్రీకృష్ణుడు అందరూ దీపావళితో ముడిపడి ఉన్నారు. వీరిలో, శ్రీకృష్ణుడు నరకాసురుడిపై సాధించిన విజయాన్ని దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? నరకాసురుడి తల్లిదండ్రులు ఎవరు? అతని రాజ్యం ఎక్కడ ఉంది? ఏ స్త్రీ అతనిని సంహరించింది?

మన ఇతిహాసాలు మరియు పురాణాలు నరకాసురుడి కథను వివరిస్తాయి. ఈ క్విజ్‌లో, మేము ఆ కథలను మీతో పంచుకుంటున్నాము. gaatha.com నుండి తీసుకున్నఈ చిత్రం, కృష్ణుడు మరియు నరకాసురుడి యొక్క సున్నితమైన లేదర్ పెయింటింగ్‌ను చూపుతోంది. అమి గణత్ర రచించిన ‘రామాయణం అన్‌రావెల్డ్’ పుస్తకాన్ని ఐదుగురు అదృష్టవంతులైన విజేతలు గెలుచుకుంటారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

నరకాసురుడి తల్లిదండ్రులు ఎవరు ?

నరకాసురుడి రాజ్యం ప్రాగ్జ్యోతిష్యపురం. అది నేటి ఆధునిక భారతదేశంలోని ఏ ప్రాంతం ?

నరకాసురుడు తన తల్లి చెవి కమ్మలను దొంగిలించిన తరువాత ఇంద్రుడు శ్రీకృష్ణుడి సహాయాన్ని కోరాడు. ఇంద్రుడి తల్లి ఎవరు?

శ్రీ కృష్ణ – నరకాసుర యుద్ధం లో గరుడమంతుడు పోషించిన పాత్ర ఏమిటి ?

కొన్ని ప్రసిద్ధ కథలలో, ఒక స్త్రీ నరకాసురుడిని సంహరిస్తుంది. ఆమె ఎవరు?

నరకాసురుడి యొక్క ఐదు తలల సేనాధిపతిని సంహరించినందుకు శ్రీకృష్ణుడి పేర్లలో ఒకటి ఆ విజయాన్ని కీర్తిస్తుంది. ఆ పేరు ఏమిటి?

నరకాసురుడిని ఓడించిన తర్వాత కృష్ణుడు అతని చెరసాల (జైలు) నుండి ఎంత మంది స్త్రీలను విముక్తి చేశాడు?

నరకాసురుడి కథ రామాయణంలో కూడా కనిపిస్తుంది. అక్కడ నరకాసురుడిని ఎవరు సంహరిస్తారు?

కాళికా పురాణం ప్రకారం, విష్ణుమూర్తి నరకాసురుడిని దేవి యొక్క ఏ రూపానికి భక్తుడిగా ఉండమని కోరాడు?

మహాభారత యుద్ధంలో నరకాసురుడి కుమారుడు అని చెప్పబడిన గొప్ప కౌరవ యోధుడు ఎవరు?

నరకాసురుడిని ఓడించిన తర్వాత సత్యభామ మరియు శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకున్న విధానాన్ని ప్రతిబింబించే దక్షిణ భారతదేశపు దీపావళి ఆచారం ఏది?

దీపావళి రోజున ‘నరకాసుర దిష్టిబొమ్మలను’ దహనం చేసే ప్రత్యేక ఆచారం ఏ రాష్ట్రంలో ఉంది?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In