196

మహాకవి కాళిదాసుకు సంబంధించిన ప్రశ్నలు జవాబులు.

సంస్కృత భాషలో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు ఉన్నత శ్రేణి కవులుగా కీర్తి పొందారు. కాళిదాసును నిస్సందేహముగా గొప్ప కవి, రచయితగా చెప్పవచ్చును. అరవింద మహర్షి చెప్పినట్టు కాళిదాసు సౌందర్య, రూపకాలంకార వర్ణనా నిష్ణాతుడు. సౌందర్యవర్ణన మహాకవి కాళిదాసు రచనలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మహాకవి కాళిదాసు చాలా రచనలు చేసినా వీరి నాలుగు పద్యకావ్యాలు, మూడు నాటకాలు అత్యుత్తమమైనవిగా పండితులు భావిస్తారు.

కాళిదాసు జయంతి సందర్భముగా, వారి రచనలు గురించి “ప్రశ్న-సమాధానం” రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కాళిదాసు ఎన్ని ఋతువులు గురించి “ఋతుసంహారము” అనే కావ్యంలో వర్ణించాడు?

“కుమారసంభవము” కావ్యం ఏ దేవసేనా నాయకుని జన్మ వృత్తాంతాన్ని గురించి తెలియచేస్తుంది.

“మేఘదూతము” లేక “మేఘసందేశము” అనే కావ్యంలో ప్రేయసి ప్రియుల సందేశాన్ని ఎవరు చేరవేస్తారు?

“రఘువంశము” ఏ ఉన్నత వంశ చరిత్రను తెలియచేస్తుంది?

భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సైనికకుట్ర జరిగిన రాజవంశ చరిత్రను “మాళవికాగ్నిమిత్ర” కావ్యం వర్ణిస్తుంది. ఆ రాజవంశము ఏది?

భారతదేశ అత్యుత్తమ సాహితీ శిల్పముగా మహాకవి కాళిదాసు రచించిన ఏ నాటకము ప్రసిద్ధి చెందింది?

మహాకవి కాళిదాసు రచించిన “విక్రమోర్వశీయం” నాటకంలో ఏ అప్సరస ప్రస్తావన కానవస్తుంది?

ఏ రాజాస్థానంలో మహాకవి కాళిదాసు ఉండేవారు?

“గఢ్ కాళిక శక్తిపీఠ” ఆశీర్వాదము ద్వారా అవివేకి / అజ్ఞాని అయిన కాళిదాసు మహా విద్వాంసుడు అయినట్టు చరిత్రకారుల అభిప్రాయం. ఈ గఢ్ కాళిక శక్తిపీఠం ఎక్కడ ఉంది?

శ్రీరాముడు వనవాసములో వచ్చిన ఒక ప్రాంతములోనే కాళిదాసు “మేఘదూతము” లేక “మేఘసందేశము” రాసినట్టు చరిత్రకారుల అభిప్రాయము. మహారాష్ట్రలోని ఆ ప్రదేశము ఏది?

శకుంతల దుష్యంతుల తపోమయ జీవితాల మలి (రెండవ) భాగంలో అత్త్యుత్తమ భారతీయ భావన ఒకటి కనిపిస్తుంది అని ప్రఖ్యాత కవి ఠాగూర్ అంటారు. ఏమిటా ప్రత్యేకమైన భావన లేక వైఖరి?

“ఉపమా కాళిదాసస్య” అని మహాకవి కాళిదాసు ఖ్యాతిగాంచారు. పద్య కవిత్వంలో అయన ప్రత్యేకత ఏమిటి?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In