రాజా వెంకోజీ, శివాజీ మహారాజ్‌కు సహోదరుడు (తండ్రి ఒకరే, తల్లులు వేరు). 1676లో ఆయన బీజాపూర్ సుల్తానేట్ తరఫున తంజావూరును జయించారు. తర్వాత అక్కడ తన స్వంత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. తంజావూరు అత్యంత సస్యశ్యామలమైన తీరప్రాంతం. అక్కడ స్వంత నౌకాశ్రయాలు కూడా ఉన్నాయి. అందుకే అది విలువైన ప్రాంతంగా భావించబడింది.
తన దక్షిణ దిగ్విజయ యాత్రలో శివాజీ గోల్కొండతో ఒప్పందం చేసుకున్నారు. శ్రీశైలాన్ని సందర్శించారు. జింజీ కోట మరియు వెల్లోర్పై దాడి చేశారు. తంజావూరు సమీపంలోని కొల్లిడం నది ఉత్తర భాగంలో శిబిరం వేసి, వెంకోజీని చర్చలకు ఆహ్వానించారు.
తంజావూరు, బెంగళూరు జాగీర్‌లో భాగం కాబట్టి, అది తన తండ్రి షాహాజీకి ఇచ్చిన ఆస్తిలో భాగమని చెప్పి, తండ్రి జాగీర్‌లో తనకూ వాటా కావాలని శివాజీ కోరారు. అయితే శివాజీ తనను అరెస్ట్ చేస్తారేమోనని భయపడి వెంకోజీ తిరిగి తంజావూరుకు వెళ్లిపోయారు. తన ఉద్దేశాలను సహోదరుడు తప్పుగా అర్థం చేసుకున్నందుకు శివాజీ బాధపడ్డారని చెబుతారు. ఆయన తంజావూరుపై దాడి చేయకుండా, తంజావూరుకు ఉత్తరంగా ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరాఠా పాలనలో తంజావూరు శతాబ్దానికి పైగా సంస్కృతి, సంగీతం, నాటకం, సాహిత్యాలకు కేంద్రంగా నిలిచింది. ముఖ్యంగా సర్ఫోజీ వంటి రాజులు కళలకు నిజమైన ఆశ్రయదాతలుగా నిలిచారు.
చిత్రం: తంజావూరులోని మరాఠా మహల్, పి. జెగన్నాథన్, వికీమీడియా కామన్స్.
మూలం: “శివాజీ అండ్ హిస్ టైమ్స్” – జదునాథ్ సర్కార్.