55

జన్మాష్టమి క్విజ్

IndiYatra quiz ఐదవ సంవత్సరం సందర్భంగా కృష్ణుడి వేణుగాన పరంపరను తెలుసుకుందాము. కృష్ణుడు నివసించిన, ప్రేమ పంచిన, యుద్దాలు చేసిన ప్రదేశాలు సందర్భాల గురించి తెలుసుకుందాము. ఐదుగురు విజేతలకు పుస్తకం బహుమానంగా ఇవ్వబడుతుంది.

వసుదేవుడు చిన్ని కృష్ణుడిని మధురాత్రి యమునా నది దాటుకుని యశోదా నందుల దగ్గర చేర్చాడు. ఆది ఏ ప్రదేశం?

ఇంద్రుడు ఏడు రోజులు ఎడతెరిపి లేని కుంభవృష్టి సృష్టించాడు. గోవులను గొల్లవాళ్ళను కాపాడడానికి కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. ఈ వృత్తాంతం నుండి ఏ సుపరిచిత ఆహార పదార్థం మనకు వచ్చింది?

కృష్ణుడు బలరాముడు ఉద్ధవుడు గురు సాందీపని దగ్గర విద్యను అభ్యసించడానికి ఏ ప్రదేశానికి వెళ్ళారు?

యాదవులు తమలో తాము యుద్ధము చేసుకుని అంతరించిపోయారు. కృష్ణుడు ప్రభాస పట్టణం లో దేహం విడిచి వెళ్ళిపోయాడు. ప్రభాస పట్టణం ఏ తీర ప్రాంతంలో ఉంది?

కృష్ణుడు ఒక మణి కోసం జాంబవంతుని తో 28 రోజులు పోరాడిన ప్రదేశం గిర్నార్ పర్వతం. ఇది హిందువులకు జైనులకు పవిత్రమైన స్థలము. ఆ మణి పేరేమిటి?

జరాసంధుడు దాడి చేసినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి కృష్ణుడు బలరాముడు సముద్ర తీరంలోని గోమంతక పర్వతం మీద తలదాచుకున్నారు. ఆ ప్రదేశం నేటి కాలంలో ఏ పేరు తో మనకు తెలుసు?

కుందినపుర (మహారాష్ట్ర లోని అమరావతి) నుండి కృష్ణుడు ఎవరిని అపహరించాడు?

పాంచాల దేశం రాజధాని అయిన ఏ నగరంలో ద్రౌపది స్వయంవరం జరిగింది?

కృష్ణుడు భీముడు అర్జునుడు మారువేషం లో జరాసంధుణ్ణి వధించడానికి మగధ రాజధాని అయిన ఏ నగరంలో ప్రవేశించారు?

వ్రజ భూమి కి చెందిన ఏ గ్రామం నందుని నివాస స్థానము? కృష్ణుడు ఇక్కడ తన బాల్యం గడిపాడు.

ఇంద్రప్రస్థను నిర్మించడానికి కృష్ణుడు అర్జునుడు ఏ అడవిని కాల్చారు?

కృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన ప్రదేశం ప్రాగ్జ్యోతిషపురం. ఈ సందర్భాన్ని నరక చతుర్దశి లేదా దీపావళిగా జరుపుకుంటాము. ప్రాగ్జ్యోతిషపురం ఎక్కడ ఉంది?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In