89

భారతీయ ఇంజినీరింగ్ క్విజ్

ఈరోజు (సెప్టెంబర్ 17, 2025) విశ్వకర్మ జయంతి. ఇంజినీరింగ్‌కు అధిపతిగా విశ్వకర్మను మొదట రుగ్వేదం లో పేర్కొన బడింది. ఆధునిక కాలంలో, విశ్వేశ్వరయ్య ఈ ఘనమైన సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. ఆయన పుట్టినరోజు (సెప్టెంబర్ 15) ఇంజినీర్ల దినోత్సవంగా జరుపుకుంటారు.

లోహశాస్త్రం, నీటిపారుదల మరియు రహదారి నిర్మాణంలో భారతీయ నాగరికత సాధించిన కొన్ని అద్భుతమైన విజయాలను ఈరోజు మనం స్మరించుకుందాం. ఇది ‘టెక్నాలజీస్ ఇన్ భారత్’ అనే మా మునుపటి క్విజ్‌కి కొనసాగింపు. ఆ క్విజ్ indiyatra.in లో అందుబాటులో ఉంది. క్విజ్‌లో పాల్గొన్న వారిలో ఐదుగురు విజేతలు బిబెక్ డెబ్రాయ్ రచించిన భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా పొందుతారు.

ఇంజినీర్ల దినోత్సవాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజున జరుపుకుంటారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీరందించే ఏ ప్రధాన ఆనకట్టను ఆయన నిర్మించారు?

సివగలై, ఇంకా ఇతర ప్రదేశాలలో లభించిన తాజా పురావస్తు ఆధారాల ప్రకారం, ఇనుమును కరిగించే సాంకేతికత 5000 సంవత్సరాల నాటిది అయి ఉండొచ్చు. సివగలై ఎక్కడ ఉంది?

తమిళనాడు కల్లణై ఆనకట్ట, క్రీ.శ 1వ శతాబ్దంలో కట్టించబడింది. ఇది భారత దేశంలోనే అతి పురాతనమైన ఆనకట్ట. ఈ ఆనకట్ట కట్టించిన రాజవంశం పేరు ఏమిటి ?

ఈ రాజవంశపు రాతి శిల్పాలకు ఒక ప్రత్యేకమైన మెరుగు, పెట్టబడి ఉంటుంది. పాట్నా మ్యూజియంలో ఉన్న ప్రసిద్ధ దిదర్‌గంజ్ యక్షిణి శిల్పంలో ఇది చూడవచ్చు. ఆ రాజవంశం పేరు ఏమిటి?

మెట్ల బావులు (బావిడ్లు) భారతీయ కళానైపుణ్యం మరియు నాగరికత యొక్క ఉద్దేశ్యం కలిసిన అద్భుతమైన ఉదాహరణ.

ఈ రాణి కి వావ్ లేదా రాణి మెట్ల బావి ఎక్కడ ఉంది?

అంతగా ప్రాచుర్యంలేని ఈ దక్షిణ భారత రాజవంశం సున్నితమైన సోప్‌స్టోన్‌తో నక్షత్రం ఆకారంలో ఉన్న ఆలయాలను అద్భుతమైన చెక్కడాలతో నిర్మించింది. వారు లాత్ ఫినిషింగ్‌తో స్తంభాలను తయారు చేశారు. ఈ రాజవంశం ఏది?

హంపి లోని విఠల మందిరం లోని స్తంభాలకు ఒక ఆసక్తికరమైన లక్షణం ఉంది. అది ఏమిటి ?

గంగా-యమునా దోఆబ్‌లో విస్తృతమైన నీటిపారుదల కాలువలను నిర్మించిన మధ్యయుగ సుల్తాన్ ఎవరు?

భారత దేశ చరిత్రలో షేర్ షా సూరి చక్రవరి పేరు, గ్రాండ్ ట్రంక్ రోడ్ తో అనుబదించబడింది. ఆ రోడ్డు, ఏ రెండు నగరాలను కలుపుతుంది ?

నమ్డాంగ్ సిలా సాకు అనేది ఒకే పెద్ద శిలలో చెక్కిన రహదారి వంతెన. ఇది ఎక్కడ లభిస్తుంది?

భారతదేశం లో వెంట్యూరీ ప్రభావంను శీతలీకరణ కోసం ఉపయోగించే యునెస్కో వారసత్వ కట్టడం ఏది ?

కేరళలోని ఆరణ్ముల అనే ప్రదేశంలో, గాజు ఉపయోగించకుండా అద్దం తయారు చేసే GI ట్యాగ్ పొందిన ప్రత్యేక సాంకేతికతకు ప్రసిద్ధి చెందింది. అది ఏమి ఉపయోగిస్తుంది?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In