132

శ్రీకృష్ణజన్మాష్టమి గురించి క్విజ్

2025లో భారత స్వాతంత్ర్య దినం, కృష్ణాష్టమి రెండూ వరుస రోజులలో జరుపుకోవడం ఆసక్తికరం, సముచితం కూడా! ఎందుకంటే, ఆ శుభదినాలు రెండూ నాగరికత-ధర్మాల పునర్జన్మను సూచిస్తాయి కాబట్టి. శ్రీకృష్ణుడు, ఆయన ప్రవచించిన భగవద్గీత చేత భారత స్వాతంత్ర్య పోరాటం ప్రభావితమయ్యింది. శ్రీకృష్ణుడి జీవితం, ప్రవచనాలచే స్ఫూర్తిని పొందిన అనేక స్వాతంత్ర్యోద్యమ నాయకులలో కొందరు భగవద్గీతకు భాష్యం కూడా చెప్పారు. కృష్ణుడి సందేశం స్వాతంత్ర్యోద్యమంలోని ప్రముఖ నాయకులను ఏ
విధంగా ప్రభావితం చేసిందో ఈ క్విజ్ లో తెలుసుకుందాం. భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! కృష్ణాష్టమి శుభాకాంక్షలు కూడా!

ఒక గొప్ప నవలారచయిత అయిన ఆయన మన జాతీయగీతాన్ని రచించారు. వారు ‘కృష్ణ చరిత్ర’ను కూడా వ్రాశారు. వారెవరు?

విప్లవకారుడుగా ఉన్న ఆయన చెరసాలలో శ్రీకృష్ణుని దివ్యదర్శనం చేసుకుని, ఆధ్యాత్మికతవైపు దృష్టి మరలించి, మనదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా విఖ్యాతినొందారు. ఆయన పేరేమిటి?

శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో భగవద్గీతను బోధించాడు. గాంధీజీ అహింసాసిద్ధాంతంలో ఇమడ్చడానికి మహాభారత యుద్ధాన్ని ఎలాగ వర్ణించారు?

భారతదేశపు ఆఖరు గవర్నర్-జనరల్, రామాయణ-మహాభారతాలపై సరళమైన, ప్రజరంజకమైన పుస్తకాలు రచించారు. ఇవి కాకుండా, విద్యార్థుల కోసం భగవద్గీతను ప్రత్యేకంగా వివరించారు. ఆయనెవరు?

సంస్కృత పండితుడూ, గణపతి భక్తుడూ అయిన ఒక ప్రజానాయకుడు తన మాతృభాషైన మరాఠీలో భగవద్గీతపై ఒక నిగూఢమైన భాష్యాన్ని రచించారు. ఆయన పేరు చెప్పండి.

హిందువేతరులకు భగవద్గీతపై ఉన్న అపోహలను తొలగించడానికి, లాలా లజ్‌పత్ రాయ్ ఆ పవిత్రగ్రంథంపై భాష్యం వ్రాశారు. ఏ భాషలో రచించారు?

కృష్ణుణ్ణి ప్రేమించిన మౌలానా’గా హజరత్ మోహానీ ఖ్యాతిగాంచారు. ప్రజారంజకమైన ఒక నినాదాన్ని ఆయన చెప్పారు. అది ఏమిటి?

స్వతంత్ర భారతదేశంలో సామ్యవాదులలో ఆయన పేరే మొదటి స్థానంలో ఉంటుంది. నాస్తికుడైనప్పటికీ ఆయన, “రాముడు, కృష్ణుడు, శివుడు భారత దేశపు మహత్స్వప్నాలు,” అన్నారు. ఆయన ఎవరు?

గీతను వెనుకనుండి చదివితే (తా-గీ అని), మానవ జీవన సారాన్ని చిలుకుతుందని వివేకానందుల వారు అభిప్రాయపడ్డారు. ఆయన ప్రస్తావించిన అర్థమేమిటి?

ఒక పద్ధెనిమిదేళ్ళ క్రాంతివీరుడు భగవద్గీతను చేతపట్టుకుని ఉరికంబం ఎక్కారు. ఆయనెవరు?

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయనికి చెందిన ఒక స్పాల్డింగ్ ఆచార్యులు , భగవద్గీతపై విద్యాపరంగా అత్యంత ప్రభావాన్ని కలిగి ఉన్న ఒక వ్యాఖ్యానాన్ని రచించారు. ఆయన పేరు చెప్పండి.

బ్రిటన్ లో పుట్టి, భారత దేశంలో హోమ్ రూల్ (స్వరాజ్య) స్థాపన కోసం పిలుపునిచ్చిన వీరు, మానవులచేత ఆవిష్కరింపబడేందుకు భగవద్గీతలో రహస్య సందేశమున్నదని భావించారు. వీరిపేరేమి?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In