220

భారత్ చ రాజా

వినాయకుడు అత్యంత ప్రియమైన దేవతలలో ఒకరు. ఆయన ముఖ్యంగా మహారాష్ట్రలో పూజలందుకుంటారు. వినాయక చవితి సందర్భంగా ముంబైవాసులు తమ ప్రాంతంలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. వీరు ఆయన్ని తమ ప్రాంతానికి రాజుగా పిలుస్తారు, ఉదాహరణకు అంధేరి చ రాజా. కానీ గణపతిని భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో పూజిస్తారు, ఆరాధిస్తారు. ఆయన నిజంగానే ‘భారత్ చ రాజా.’ భారతదేశం అంతటా గణేశుడిని ఎలా పూజిస్తారో తెలిపే ఈ 12 ప్రశ్నల క్విజ్‌ని ప్రయత్నించండి. ‘గణపతి బప్పా మోరియా’ అనే నినాదం ఎలా ప్రారంభమైంది? జైనులు గణేశుడిని ఎలా పూజిస్తారు? ఇతర ప్రధాన పండుగలలో గణపతి భాగస్వామ్యం ఎలా ఉంది? ఏ పురాణం గణేశుడిని ఉపనిషత్తులకు అనుసంధానిస్తుంది? అదృష్టవంతులైన ఐదుగురు క్విజ్ విజేతలకు “గణేశ, ది ఆస్పీషియస్, ది బిగినింగ్” అనే అద్భుతమైన చిత్రీకరణతో కూడిన పుస్తకం బహుమతిగా లభిస్తుంది. ఈ చిత్రం గణపతి విసర్జనకి సంబంధించినది. క్రెడిట్, అవార్డు గ్రహీత ఫోటోగ్రాఫర్ సలోనీ జైన్.

1892వ సంవత్సరంలో మొదటి ‘సార్వజనిక్’ లేదా బహిరంగంగా గణేశోత్సవాన్ని, శ్రీమంత్ భవుసాహెబ్ రంగారి గారు నిర్వహించారు. అది ఏ నగరంలో జరిగింది?

గణపతి బప్పా మోరియా’ అనేది ఒక అత్యంత జనరంజకమైన నినాదం. అసలు ‘మోరియా’ అనే పదానికి అర్థం ఏమిటి?

గణేశోత్సవం కాకుండా గణేశుడిని మరో పండుగలో కూడా చాలా రోజులు పూజిస్తారు. అది ఏది?

లాల్‌బాగ్చా రాజా’ ముంబైలో అత్యంత ప్రసిద్ధ గణేశోత్సవం. ఆయనను ‘నవసాచా గణపతి’ అని పూజిస్తారు. ‘నవసాచా’ అంటే ఏమిటి?

ప్రసిద్ధ మరాఠీ గణపతి ప్రార్థన ‘సుఖ్కర్త దుఃఖ్హర్త’ను రచించినవారు ఎవరు ? ఈయన ఛత్రపతి శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా, స్ఫూర్తిప్రదాతగా కూడా ఉన్నారు.

ధార్మిక సూత్రాన్ని వివరించడానికి గణేశుడి వివిధ అవతారాలను, ముద్గల పురాణం ఉపయోగిస్తుంది. అది ఏది?

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలలో దేశంలోనే అతి ఎత్తైన విగ్రహం ఉంటుంది, కానీ అది ఒక అడుగు విగ్రహంతో మొదలైంది. ఈ ఉత్సవం ఏ నగరం లో జరుగుతుంది?

ప్రసిద్ధ గణేశ శ్లోకం ‘వక్రతుండ మహాకాయ’ ను ఎవరు రచించారు?

జైనులు కూడా గణేశుడిని పూజిస్తారు. జైనులచే ఆయన ఏ అంశానికి సంబంధించిన దేవుడిగా పరిగణించబడ్డాడు?

చాలా దక్షిణాది కర్ణాటక సంగీత కచేరీలు గణేశుడిపై ఉన్న ఒక ఉత్సాహభరితమైన సంగీత స్తుతితో మొదలవుతాయి. ఆ పాట ఏది?

విష్ణు సహస్రనామ’ స్తోత్రం, అన్ని అడ్డంకులను తొలగించే దేవతా ప్రార్థనతో మొదలవుతుంది. కొందరు దీనిని గణేశుడి ప్రార్థనగా భావిస్తారు. ఈ స్తోత్రం మొదటిసారిగా ఎక్కడ కనిపిస్తుంది?

పూరిలోని జగన్నాథుడు, ఒక ప్రముఖ పండుగకు ముందు గణేశుడి రూపాన్ని (హాతీ బేష) ధరిస్తాడు. ఆ పండుగ ఏది?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In