52

భారతదేశంలో పోర్చుగీసులు

ఈ రోజు (డిసెంబర్ 19) గోవా మిగతా భారతదేశం కంటే 14 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ పొందిన రోజు.
పోర్చుగీసులు భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్ వలస పాలకులు. వారు 1498లో భారత్‌కు వచ్చి, 1961 వరకు ఇక్కడే ఉన్నారు. మొదట సముద్ర వాణిజ్యంలో వాళ్లదే ఆధిపత్యం అయినా, కొద్ది కాలానికే డచ్‌లు మరియు బ్రిటిష్‌లు వాళ్లను మించిపోయారు. గోవా పోర్చుగీసుల ప్రధాన కేంద్రంగా మారింది.

అయితే కార్డినల్ గ్రాసియాస్ ఒకసారి ప్రసిద్ధిగా అన్న మాట ఏమిటంటే – “గోవాన్ కాథలిక్ సంస్కృతి క్రిస్టియన్‌ది, పోర్చుగీస్‌ది కాదు.”

ఈ క్విజ్‌లో భారతదేశంలో పోర్చుగీసుల ఉనికికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు, వ్యక్తులు, అంశాలు ఉంటాయి. ముఖ్యంగా M.N. పియర్సన్ రాసిన “The Portuguese in India” మరియు A.K. ప్రియోల్కర్ రాసిన “The Goa Inquisition” పుస్తకాల ఆధారంగా ఇది రూపొందించబడింది.

1498లో భారతదేశానికి వచ్చిన ప్రసిద్ధ పోర్చుగీస్ నావికుడు ఎవరు?

1510లో పోర్చుగీసులు గోవాను ఆక్రమించే ముందు గోవాపై ఎవరి ఆధిపత్యం ఉండేది?

మధ్యయుగ కాథలిక్ చర్చ్ సంస్థ గోవాలో క్రైస్తవులు కానివారిని భయపెట్టేది ఏది?

గోవా రక్షకుడిగా (“గోయెంచో సాహెబ్”) పిలవబడే జెస్విట్ సంత్ ఎవరు?

పోర్చుగీసులు కేరళలో ఏ ప్రాచీన మత సంఘాన్ని దాడి చేశారు?

మార్సెల్, న్యూ గోవాలోని దేవి భాగవతి మందిరం నుంచి పాత గోవాలోని తిస్వాడికి ప్రతి సంవత్సరం జరిగే యాత్ర ఏది గుర్తు చేస్తుంది?

1683 లో గోవాను ఆక్రమించదాన్ని తృటిలో పోగొట్టుకున్న మరాఠా రాజు ఎవరు ?

పోర్చుగీసులు బ్రిటిష్‌కు కానుకగా ఇచ్చిన భారత నగరం ఏది?

పోర్చుగీసులు భారత దేశం నుంచి మసాలాలు ఎగుమతి చేసుకునేవారు. ఐతే వాళ్ళు భారత దేశానికి ప్రధానంగా వేటిని దిగుమతి చేసేవారు.

భారతదేశంలో పోర్చుగీసులు పరిచయంచేసిన ప్రధాన ఆహారం ఏది?

1556లో పోర్చుగీసులు గోవాలో ఈ భవనంలో యూరోపియన్ లోని ఒక విప్లవాత్మక ఆవిష్కరణను ఏర్పాటు చేశారు. అది ఏది?

భారతదేశంలో పాత మూఢాచారం ఇప్పుడు పోర్చుగీస్ పదం ద్వారా చెప్పబడేది ఏది?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In