167

ఉపనిషత్తులు

ఉపనిషత్తులు భారతీయ తత్వశాస్త్ర ఆధారమైన వేదాంతార్భాగములు. గురు-శిష్య ఆధారభూతమైన ఉపనిషత్తుల (ఉప – దగ్గరగా, ని – క్రింద లేక చెంత, సద్ – కూర్చొనుట) అసలు అర్ధం – గురువు సమీపంలో కూర్చొనుట. శంకరులు, రామానుజుల వంటి మన గురువులుచే వ్యాఖ్యానించబడిన ఈ ఉపనిషత్తులు 10 నుండి 13 గా పండితుల వాదన.

ఈ ప్రశ్నోత్తరావళి ఉపనిషత్తుల ద్వారా చెప్పబడిన (బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య వంటి సూత్రాలు) సత్య నిర్దేశనం ఏమిటి అనే వాటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపనిషత్తులపై కూలంకష పరిశోధన నెరిపిన గీతాకులకర్ణి, ఇతరులు సేకరించబడిన విషయముల ద్వారా ఈ ప్రశ్నోత్తరావళిరూపొందించబడినది. ఉపనిషత్తుల విస్తృత సారాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్న మమ్ము ఆ మహాసముద్రములోని ఒక బిందువుగా పరిగణించి తప్పొప్పులు క్షమించ ప్రార్ధన. గీతాకులకర్ణి గారికి కృతజ్ఞతలతో .

Maniam Selvan Picture – Guru Sishya tradition in the background of Dakshnimoorthy

ఏదేని కార్యం చేయునపుడు, అర్ధం చేసుకునే వైఖరి సముచితమైనదే అయినప్పుడు, ఫలితం మనలను బాధించదు అని చెప్పే ఈశావాస్యోపనిషద్ వాక్యం, మరొక గ్రంధం లోనూ ఇదే భావాన్ని సూచిస్తుంది. ఆ గ్రంధం ఏమిటి?

పరిశోధనార్హమైన మొదటి వాక్యమే కేనోపనిషత్తు కు పేరుగా నిర్ణయింపబడినది. కేన అనే పదము అర్ధము ఏమిటి?

ఇంద్రియములు, బుద్ధి, తెలివి, నేను అనే వాటి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియచెప్పటానికి ఏ ఉపమానాన్ని కఠోపనిషత్ ఉటంకించినది?

ఏ మంత్రాన్ని నిరంతర ధ్యానం చేయటం, లేదా ఏ చిహ్నము అనుసరించటం హిందూమత మూలసూత్రంగా భావిస్తామో, ఆ మంత్రం/చిహ్నం ఉన్నతత్వాన్ని ప్రశ్నోపనిషత్ స్థిరపరిచింది? ఆ మంత్రము లేక గుర్తు ఏది?

మన గణతంత్ర రాజ్యము ముండకోపనిషత్తు నుండి ఒక జాతీయ నినాదము తీసుకున్నది. ఏమిటా నినాదము?

మెలకువ, స్వప్నం, సుషుప్తి స్థితులే కాక పరమ సత్యమైన నాలుగో స్థితిని మాండూక్యోపనిషత్తు వర్ణిస్తుంది. ఆ స్థితి ఏమిటి?

తైత్తరీయ ఉపనిషత్తు ననుసరించి మానవుని వ్యక్తిత్వము ఎన్ని విధాలుగా కప్పబడి ఉంటుంది?

ఐతరేయ ఉపనిషత్తు పేరు ఈ క్రింది వ్యక్తుల వృత్తి లేక పేరు మీద వచ్చింది. వారు ఎవరు?

ఛాందోగ్య ఉపనిషత్తులోని హరిద్రుమాత గౌతముడు అనే ఋషి ఎవరి పుత్రుని తన శిష్యునిగా స్వీకరించారు?

ఉన్నతమైన సత్యము మానవ విచారానికి లేక ఆలోచనకు అర్ధము కానిది అనే అర్ధములో ఇది కాదు, అది కాదు అని బృహదారణ్యక ఉపనిషత్తు బోధిస్తుంది. ఆ ఉపదేశమేది?

నిష్క్రమించు

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In