హనుమంతుడు ఒక రాజ వానర దంపతులకు జన్మించాడు: ఆయన తండ్రి కేసరి, తల్లి అంజన. ఆయనను ఆంజనేయ (“అంజనీ కుమారుడు”) మరియు కేసరీనందన (“కేసరి కుమారుడు”) అని పిలుస్తారు. హనుమ జననం ఆయన తల్లిదండ్రులకు, మారుత్, వాయు లేదా పవన్ అనబడే వాయుదేవుని ఆశీర్వాదాల ఫలితం. ఆంజనేయస్వామి అనే పేరు దక్షిణ భారతదేశంలో చాలా సాధారణం. వాయుదేవుని అంశగా, హనుమంతుడిని ‘మారుతి’, ‘వాయుపుత్ర’ లేదా ‘పవనపుత్ర’ అని కూడా పిలుస్తారు. కొన్ని కథలు హనుమంతుడు, రాముడు ఏకకాలంలో జన్మించారని సూచిస్తున్నాయి. సంతానం కోసం దశరథుడు చేసిన యజ్ఞ సమయంలో, దేవతలు ఆయన ముగ్గురు భార్యలకు పాయసం ప్రసాదంగా పంపి ఆశీర్వదించారు. అదే సమయంలో, హనుమంతుడి తల్లిదండ్రులు సంతానం కోసం ప్రార్థిస్తున్నారు. దేవతలు స్వర్గం నుండి పాయసం పంపినప్పుడు, వారు కొన్ని చుక్కలను అంజనాదేవికి మళ్లించమని వాయువును ఆదేశించారు. అందువలన, రాముడు మరియు హనుమంతుడు దివ్య ఆశీర్వాదంతో ఒకే సమయంలో జన్మించారని చెపుతారు.
మూలం: “ది స్టోరీ ఆఫ్ హనుమాన్,” డర్హామ్ యూనివర్సిటీ
Raja Ravi Varma’s painting