39

రక్షా బంధన్ క్విజ్

భాస్కరాచార్యులు తన ప్రసిద్ధ గణిత శాస్త్ర గ్రంథానికి తన కుమార్తె లీలావతి పేరు పెట్టారు. రూపకాలంకారంగా, STEM రంగంలోని మహిళలందరూ లీలావతి కుమార్తెలే. ఈ క్విజ్ భారతదేశంలో STEM రంగంలో మహిళల వారసత్వాన్ని చాటిచెబుతుంది. అదృష్టవంతులైన ఐదుగురు పాల్గొనేవారు ఒక పుస్తకాన్ని బహుమతిగా గెలుచుకుంటారు.

1. బ్రహ్మవాదినులు వేద కాలానికి చెందిన మహిళా ఋషులు. వీరిలో అగస్త్య ముని భార్య ఎవరు?

మధ్యయుగానికి చెందిన రూసా ఒక ఆయుర్వేద వైద్యురాలు. ప్రఖ్యాత హరూన్ ఆల్ రషీద్ గారి ఆస్థానంలో రూసా గారి రచనలను సేవలనూ కొనియాడారు.
రూసా గారి రచనలు ఏ భాషలోకి అనువదించారు

గార్గి మరియు మైత్రేయి పురాతన కాలంలో ప్రసిద్ధి చెందిన వేదాంత నిపుణులు. వారి పేరుతో 2 కళాశాలలు ఉన్నాయి.
ఏక్కడ ?

భారత దేశంలో శాస్త్ర విద్యలో పరిశోధన చేసిన మొదటి మహిళా శాస్త్రవేత్త కమలా సొహోనీ. పూర్వం ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆమెను తిరస్కరించారు కానీ తరువాత అదే సంస్థలోకి తీసుకున్నారు. ఆ శాస్త్రవేత్త ఎవరు?

9 సంవత్సరాల లేత వయస్సులో పెళ్ళి అయి, 14 సంవత్సరాలకే బిడ్డను కోల్పోయి, 18 సంవత్సరాల వయసు లో భారత దేశం వదలి, 21 సంవత్సరాలకే పాశ్చాత్య వైద్యశాస్త్రంలో ఉత్తీర్ణురాలై అదే సంవత్సరం మరణించిన మహిళ ఎవరు?

6. వైద్య వృత్తిని చేపట్టిన రెండవ మహిళ రుక్మాబాయి. అంతకుముందే ఆమె సామాజిక సంస్కరణల విషయంలో విజయాలు సాధించారు. ఆమె దేని కోసం ప్రముఖంగా పోరాడారు?

7. “అగ్ని పుత్రి” అని పిలువబడే ఈమె, నిజానికి అగ్ని IV మరియు V ల సారథి మరియు భారత క్షిపణి కార్యక్రమానికి మొదటి మహిళా డైరెక్టర్. ఈమె ఎవరు?

8. 56 ఏళ్ల వయసులో, మంగళ మణి 15 నెలల పాటు సాగిన ఒక కఠినమైన యాత్రలో పాల్గొన్న ఏకైక మహిళగా నిలిచారు. అందులో భాగంగా ఆమె ఎక్కడ ఉన్నారు?

9. సర్కస్ కళాకారుడికి జన్మించిన ఆమె, ఇందిరా గాంధీకి బుద్ధి చెప్పేందుకు ఆమెపై ఎన్నికల్లో పోటీ చేశారు; కానీ ఆమెకు గుర్తింపు తెచ్చిన అంశం మాత్రం ‘546372891^23’. ఇంతకీ ఆమె ఎవరు?

10. అన్నా మణికి ఎంఎస్సీ పట్టా లేనందున ఆమె పీహెచ్‌డీని కోల్పోయింది. పరికరాల రూపకల్పనలో మార్గదర్శకురాలైన ఆమె పరికరాల రూపకల్పన ఏ రంగంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది?

11. కణ భౌతికశాస్త్రం (particle physics)పై బిభా చౌధురి చేసిన కృషిని ఇద్దరు నోబెల్ బహుమతి గ్రహీతలు ఉపయోగించుకున్నారు, కానీ ఆమె చేసిన కృషి ఎక్కడా నమోదు కాలేదు. ఆమెను ఇప్పుడు ఎలా గుర్తుచేసుకుంటారు?

12. ఈ రాజప్రతినిధి రాణి (queen regent) ఇచ్చిన భూమి మరియు ఒక పారిశ్రామికవేత్త సమకూర్చిన సంపదలో సగం భాగంతో ఈ ప్రపంచ స్థాయి సంస్థ స్థాపించబడింది. ఆ సంస్థ ఏది?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In