131

నవదుర్గ క్విజ్

యా దేవి సర్వభూతేషు – ప్రతి జీవిలో చైతన్య రూపంగా, ప్రకృతి రూపంలో ఉండే శక్తి రూపమైన దేవి/ అమ్మను నవరాత్రులలో తొమ్మిది రూపాలలో ఉండే శక్తిని నవదుర్గలుగా మేము ఈ ప్రశ్నలలో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాము. ఆ శక్తి వివిధ రూపాలలో, దేవి మహాత్మ్యం లోని నవదుర్గ స్తోత్రం లో వర్ణింపబడి ఉంది. ఈ నవదుర్గ స్తోత్రం ఎవరు రచించారు అనేది ఖచ్చితంగా తెలియకపోయినా ఆర్ట్ అఫ్ లివింగ్ వారి అంతర్జాలం నుండి తీసుకొనబడినది.

ఇండియాత్ర వారి పూర్వ ప్రస్నావళులలో కూడా దేవి వివిధ అవతారముల గురించి, వివిధ శక్తిపీఠముల గురించి, దుర్గా సప్తశతి లో ఉదహరించిన కొన్ని కథల గురించి తెలియచేయడం జరిగింది. మీకందరకూ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు.

నవరాత్రి మొదటి రోజు, దేవి శైలపుత్రి గా ఆరాధింపబడుతుంది. శైల అంటే అర్ధం ఏమిటి?

ఏ కోరికతో లేక కారణంతో రెండవ నవదుర్గ రూపమైన “బ్రహ్మచారిణి” తీవ్ర తపస్సు చేసింది?

మూడవ నవదుర్గ రూపమైన చంద్రఘంట శిరస్సున చంద్రుడు ఏ రూపంలో కొలువై ఉంటాడు?

నాలుగవ నవదుర్గ రూపమైన కూష్మాండ మాత జగత్తును ఏ విధంగా సృష్టించింది?

స్కందమాత గా పూజలందుకునే ఐదో నవదుర్గ మాత పుత్రుడు ఎవరు?

కాత్యాయనీ దేవి నిత్యం ధరించే “చంద్రహాసము” అనే ఖడ్గాన్ని (కరవాలాన్ని) శివుడు ఎవరికి బహూకరించాడు?

భయం కలిగించే రూపంలో, నవరాత్రుల ఏడవ రోజు అమ్మను/దేవిని భక్తులు కాళరాత్రి గా కొలుస్తారు. కాళరాత్రి అమ్మ వాహనము ఏమిటి?

“మహాగౌరి” నవదుర్గ లలో ఎనిమిదవ రూపం. గౌరీ అర్ధం ఏమిటి?

సిద్ధిదాత్రి శివుని కలయిక వలన ఏర్పడిన ద్విలింగ రూపమేమిటి?

గుజరాత్ & మహారాష్ట్రలలో ప్రసిద్ధి చెందిన ఆచారంలో, నవరాత్రిలోని ప్రతి రోజు ఏ నిర్దిష్ట వస్తువుతో ముడిపడి ఉంది?

తాంత్రిక పద్ధతులు తొమ్మిది నవదుర్గలను శరీరంలోని చక్రాలతో (శక్తి కేంద్రాలు) అనుసంధానిస్తాయి. మొత్తం ఎన్ని చక్రాలు ఉన్నాయి ?

నవరాత్రి తొమ్మిది రోజులు దేవి యొక్క ఇతర రూపాలతో మూడు సమూహాలుగా సంబంధం కలిగి ఉంటాయి. వాటి క్రమం ఏమిటి?

నిష్క్రమించండి

How did you like this quiz?

Get quiz links

We will send you quiz links at 6 AM on festival days. Nothing else 

Opt In