స్వరభాను అనే అసురుడు ఋగ్వేదంలోని ప్రాచీన సూక్తుల్లో ప్రస్తావించబడ్డాడు. గ్రహణాలకు అతడే కారణమని అక్కడ పేర్కొంటారు. పురాణాల్లో ప్రసిద్ధమైన కథ ప్రకారం, సముద్ర మథనం సమయంలో స్వర్భాను దేవతలా వేషం వేసుకుని అమృతాన్ని సేవిస్తాడు. సూర్యుడు, చంద్రుడు అతన్ని గుర్తించి విష్ణువుకు తెలియజేస్తారు. అప్పుడు విష్ణువు అతని తలను వేరుచేస్తాడు. అయితే, అప్పటికే అమృతాన్ని సేవించినందున, అతని తల రాహువుగా, శరీరం కేతువుగా మారి రెండూ అమరత్వాన్ని పొందాయి.
ప్రతీకారం తీర్చుకోవడానికి రాహు, కేతువులు కాలానుగుణంగా సూర్యుడు, చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తారని, అందువల్ల సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవిస్తాయని నమ్మకం.
ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం ప్రధానంగా రాత్రి ఆకాశం, నక్షత్రాలపై దృష్టి పెట్టింది. నవగ్రహాలు అనేవి తరువాత కాలంలో ఏర్పడిన భావన. అందులో సూర్యుడు, చంద్రుడు, అలాగే భూమిని మినహాయించి బుధుడు నుంచి శనివరకు ఉన్న ఐదు గ్రహాలు ఉంటాయి. ఈ సమూహాన్ని పూర్తి చేయడానికి రాహు, కేతువులను “చాయాగ్రహాలు” లేదా “తమోగ్రహాలు”గా చేర్చారు. ఖగోళ పరంగా, ఇవి సూర్యుడు, చంద్రుడు సంచరించే మార్గాలు కలిసే రెండు బిందువులను సూచిస్తాయి; ఇవి ఒకదానికి మరొకటి 180 డిగ్రీల దూరంలో ఉంటాయి. కనిపించని గ్రహాలు గ్రహణాలకు కారణమవుతాయని చెప్పే భావన భారతదేశానికి ప్రత్యేకమైనది.
ప్రారంభ భారతీయ గ్రంథాల్లో “కేతు” అనే పదం ధూమకేతువులు (కామెట్లు) లేదా ఉల్కలు వంటి ప్రకాశించే ఆకాశ ఘటనలను కూడా సూచిస్తుంది, వీటిని అపశకునాలుగా భావించేవారు.
నవగ్రహాలు మనుషుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచే దేవాలయాలలో వీటిని మానవ రూపంలో ఆరాధించడం ప్రారంభమైంది.
మూలం: https://www.britannica.com/topic/navagraha
చిత్రం: భాగవతం కథ లోనిది