ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, తులసి దుష్టులను అందమైన నెమలితో పోల్చాడు!
అతడు ఉత్తరకాండలో ఇలా వ్రాశాడు:
“నెమలిలాగ వారి మాటలు తేనెలాంటి తీయదనంతో ఉంటాయి; అయితే, నెమలి ఎంత అందంగా ఉన్నా, ఒక కఠోరహృదయ; అత్యంత విషమున్న సర్పాన్ని కూడా భక్షిస్తుంది. అలాగే, వారు ఇంట్లోనైనా, వాణిజ్యంలోనైనా, భోజనంలోనైనా- ఎటువంటి లావాదేవిలోనైనా వక్రంగా వ్యవహరిస్తారు.”
నెమలి సాధారణంగా అందానికీ, రాచరికానికీ ప్రతీకగా పరిగణింపబడుతుంది. ఆ పక్షి కార్తికేయుడి వాహనం; కృష్ణుడు దాని పింఛాన్ని శిరస్సుపై అలంకారంగా చేసుకున్నాడు. అయితే, ఇటువంటి పక్షి ఒక పాముని జయించడం విశేషం. ఈ విషయాన్ని వాడుకుని తులసి ఒక లౌకికమైన పోలిక చేశాడు. తులసి వాడే సాదాసీదా సారూప్యతలో చాలా వరకూ మనోహరమైనవే అయినా స్త్రీలను గురించినవి కొన్ని, మరికొన్ని సమాజికవర్గాలకు చెందినవి ఇంకా కొన్ని- విమర్శకు గురయ్యాయి. కానీ, ఈ మహాకవి సవినయంగా సజ్జనులు తన గ్రంథాన్ని మెరుగుపరచవచ్చని మనవి చేశాడు.