బౌద్ధ పురాణాల ప్రకారం అవలోకితేశ్వరునికి తన చరిత్ర బలి చెప్పినట్లుగా రాయబడింది.
గర్వము, అహంకారం కలిగిన బాలి చక్రవర్తి తన నుండి దానం తీసుకునేందుకు చాలామంది రాజులను, బ్రాహ్మణులను ఆహ్వానిస్తాడు. వచ్చిన వారందరి ముందూ తనను తానూ చాల గొప్పవానిగా భావించి, దానం పుచ్చుకొనవచ్చిన స్త్రీలను, చిన్నపిల్లలను నిర్దయగా సంహరించి, కౌరవ, పాండవులతో సహా క్షత్రియులనందరిని ఖైదు చేయించి సాక్షాత్తూ నారాయణుని గురించి వెదకటం మొదలుపెడతాడు. నారాయణుడు దశరధపుత్రునిగా (శ్రీరామునిగా) వచ్చి కౌరవ పాండవులను వదిలివేసి, తాను ఒక మరుగుజ్జు రూపంలో బలి వద్దకు వెళ్లి రెండు అడుగులు మాత్రమూ దానం అడుగుతాడు. బలి మాత్రం అహంకరించి మూడు అడుగులు ఇస్తానని చెప్పి. మూడో అడుగు ఇవ్వలేకపోతాడు. ఆగ్రహించిన దశరధపుత్రుడు బలిని బహిష్కరించి పాతాళలోకానికి పంపివేస్తాడు. బలి ఈ కథను అవలోకితేశ్వరునికి చెపుతూ తాను అహంకరించి పలికిన కారణంగా తాను పాతాళానికి పట్టుబడి పోయానని చెబుతాడు. అవలోకితేశ్వరుడు బలికి ధర్మాధర్మములు విశిదపరచి, తధాగతుడనే పేరుతో సంపూర్ణ జ్ఞానవంతునిగా మారగలవని తెలియచేస్తాడు.
ఆ విధంగా బౌద్ధ సంప్రదాయం బౌద్ద ధర్మాన్ని, వామన అవతారాన్ని ,రామాయణ భారతాలను ముడి వేస్తోంది.
మూలం: కారంద వ్యూహ సూత్రం – విజ్ డం సం.
Picture Credit: Vrindavan Das