సంప్రదాయం ప్రకారం, సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి ఇద్దరు పాలకులు హక్క (హరిహర) మరియు బుక్కరాయలు విద్యారణ్యుడిచే ప్రేరణ పొందారు. వారు విజయనగరాన్ని ఆయన ఆశీస్సులతో స్థాపించారు. విద్యారణ్యుడు శృంగేరి మఠానికి అధిపతి.
హక్క మరియు బుక్కరాయలు వేటకు వెళ్లినప్పుడు, వేట కుక్కల గుంపుతో ఒక కుందేలు పోరాడటం చూశారని ఒక పురాణం ఉంది. సోదరులు తమ గురువు విద్యారణ్యుడికి ఈ విషయాన్ని తెలియజేశారు, ఆయన ఆ ప్రదేశంలో విజయనగరాన్ని (విజయ నగరం) స్థాపించమని సలహా ఇచ్చారు.
వారి మూలం గురించి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటిది, వారు కన్నడ మూలం కలిగి ఉన్నారని, హొయసల సామంతులు ఉండి, హొయసల పతనం తర్వాత అధికారం బదిలీ అయి. వారు విజయనగరాన్ని స్థాపించారు అని, రెండవ కథనం ప్రకారం ఆ సోదరులు తెలుగువారు, కాకతీయ ఖజానాకు బాధ్యత వహిస్తూ, కాకతీయుల ఓటమి తర్వాత వారు పట్టుబడగా, వారిని బంధించి, బలవంతముగా మతం మార్చగా, తిరిగి మతం మారి, తప్పించుకుని సామ్రాజ్యం స్థాపించారని ఒక కట్టుకథ ప్రచారంలో ఉంది.
వికీమీడియా చిత్రం తెలియని పెయింటింగ్, ఇది సోదరులు విద్యారణ్యను కలిసినట్లు చూపిస్తుంది.
మూలం:https://pragyata.com/harihara-bukka-and-the-birth-of-vijayanagara/