త్రిఫల అంటే మూడు ఫలాలు. ఉసిరి, కరక్కాయ, తానికాయ. అరబ్బులు త్రిఫల మాదిరి ధ్వనించే అత్రిఫల్ అని పేరుపెట్టగా, చైనీయులు మూడు మూలికలు అనే పేరొచ్చే సన్గ్ తెంగ్ అని పేరు పెట్టుకున్నారు.
చాల ముందుగానే భారతీయ ఆయుర్వేద జ్ఞానం ఇతర దేశాలకు పాకింది. 3వ .శ CE లోనే రోమన్లు భారతీయ మందులు చాల శక్తివంతమైనవని గుర్తిచారు. అరబ్బు తత్వవేత్తలు అల్ తబరి, అల్ కిండి , అల్ బిరూని, అల్ అండలూసి మొదలగువారు భారతీయ వైద్య శాస్త్రజ్ఞులను, మరీ ముఖ్యంగా చరకుడి శాస్త్రాలను గుర్తించారు. అల్ కిండి పుస్తకంలో సుమారు 13 శాతం పైగా భారతీయ వైద్యం గురించే ప్రస్తావించాడు. సిమాయో కూడా బుద్ధుని వైద్యుడు జీవకుని పరిశోధనలు ప్రస్తావించాడు. జీవకుని గురువు, జీవకుని అరణ్యంలో ఉపయోగకరం కానీ మొక్కులను గుర్తించి తీసుకురమ్మంటే, ఉత్తచేతులతో తిరిగివచ్చి ఔషధ లక్షణాలు లేని ఒక్క మొక్క కూడా లేదని నిర్ధారించాడు.
‘హార్టుస్ మలబారిక’ (మలబారు తోట) అనే పుస్తకంలో దక్షిణ భారతదేశం లోని ఓషధీయ మొక్కల ప్రస్తావన కనబడుతుంది. 30 సంవత్సరాలు పరిశోధించి 1678-1693 మధ్య కాలంలో ఆంస్టర్డాం లో ప్రచురించబడిన ఈ పుస్తకంలో సుమారు 742 మొక్కల విశేషాలు, చిత్రాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశం కేరళకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఇట్టే అచుడెం పరిశోధనల ఆధారంగా హెన్డ్రిక్ వాన్ రీద్ అనే డచ్ మలబార్ గవర్నర్ ఈ పుస్తకాన్ని ప్రచురించాడు.
హార్టుస్ మలబారిక అనే పుస్తకంలోని ఒక పేజీ ఈ చిత్రం. www.rcseng.ac.uk వారి సౌజన్యంతో.
మూలము: “ప్రాచీన హిందూ విజ్ఞానము”, అలోక్ కుమార్, కోరిన్ హోగన్, www.rcseng.ac.uk